ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో కార్డ్‌బోర్డ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకుడు, తన భార్య, ఆమె ప్రియుడు తనపై దాడి చేసి, వేడి నూనె పోసి కాలు కాల్చారని ఆరోపించాడు. అయితే, భర్తే తనపై దాడి చేశాడని భార్య ఎదురు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన విచారణ జరగలేదని ఆరోపిస్తూ, బరేలీ ఎస్ఎస్పీని ఆశ్రయించాడు. ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య మాట్లాడుతూ.. ఇరుపక్షాల ఫిర్యాదులు అందాయని, వైద్య, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా నిష్పాక్షికంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.