AP: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తికి చెందిన ఒలిపల్లి ఈశ్వరరావు, భార్య గాయత్రి(24) ద్విచక్రవాహనంపై అన్నవరం వెళ్తుండగా కాగిత సమీపంలో వెనుక నుంచి వచ్చిన వ్యాన్ బైక్‌ను ఢీకొట్టింది. ఈశ్వరరావు కిందపడిపోగా, గాయత్రి వ్యాన్‌పై పడింది. అదే వేగంతో వ్యాన్ ముందున్న లారీని ఢీకొట్టడంతో రెండు వాహనాల మధ్య చిక్కుకున్న గాయత్రి అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన ఈశ్వరరావు కళ్లముందే భార్య చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.