మూడో వ్యక్తితో భార్య పరార్.. ఇద్దరు భర్తలు ఫిర్యాదు

2083చూసినవారు
మూడో వ్యక్తితో భార్య పరార్.. ఇద్దరు భర్తలు ఫిర్యాదు
బెంగళూరుకు చెందిన వీరేగౌడ, అనంతమూర్తి అనే ఇద్దరు వ్యక్తులు తమ భార్య సుధారాణి తమను మోసం చేసి పరారైందని దొడ్డబళ్లాపుర ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా, సుధారాణి ఇద్దరు భర్తలను మోసం చేసి, మూడో వ్యక్తితో పరారైనట్లు గుర్తించారు. వీరేగౌడను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుధారాణి.. భర్తకు వాహనాలు నడపడం రాదని డెలివరీ బాయ్ అనంతమూర్తితో ప్రేమ నాటకం ఆడి, రూ.20 లక్షలు తీసుకుని అతన్ని కూడా మోసం చేసింది. ప్రస్తుతం ఆమె కనకపురానికి చెందిన మరో వ్యక్తితో పరారైందని గుర్తించి, ఈ ఇద్దరు భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్