TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని భరత్ నగర్‌లో దారుణం జరిగింది. కుమారుడి సాయంతో భార్య తన భర్త తాజుద్దీన్(60) కళ్లల్లో కారం కొట్టి, కర్రలతో చితకబాది చంపేసింది. కుటుంబ కలహాలతోనే చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతుడి స్వస్థలం వికారాబాద్ జిల్లాలోని భూచన్ పల్లిగా గుర్తించారు. కాగా తాజుద్దీన్ భరత్ నగర్‌లో అద్దెకుంటూ కూలీ పని చేస్తున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.