చీరతో చేతులు కట్టేసి భర్తను నరికి చంపిన భార్య

26642చూసినవారు
చీరతో చేతులు కట్టేసి భర్తను నరికి చంపిన భార్య
TG: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయపల్లి గ్రామంలో భార్య కవిత, తన భర్త నాగేశ్‌ను చీరతో చేతులు కట్టేసి కత్తితో అతికిరాతకంగా నరికి చంపింది. 17 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరికి ముగ్గురు పిల్లలున్నారు. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, పెద్దల పంచాయితీ తర్వాత కూడా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆదివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. చిన్న కుమారుడి కేకలతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా, నాగేశ్ రక్తపు మడుగులో కనిపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతిచెందారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్