వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసిన భార్య

24129చూసినవారు
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసిన భార్య
TG: నల్గొండ జిల్లా సీత్యతండాలో జరిగిన దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. 34 ఏళ్ల రమావత్ రవిని అతడి భార్య లక్ష్మి, మేనల్లుడు గణేశ్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వృషణాలపై బలంగా కొట్టి, గొంతు నులిమి చంపినట్లు తేలింది. నిందితులిద్దరి మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉండగా, దీనికి అడ్డుగా ఉన్నాడనే రవిని హతమార్చారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిందితులు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్