అన్నదమ్ములతో కలిసి భర్తను చంపిన భార్య!

3361చూసినవారు
అన్నదమ్ములతో కలిసి భర్తను చంపిన భార్య!
TG: అన్నదమ్ములతో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి (D) కడ్తాల్ (M)లోని నార్లకుంట తండాకు చెందిన జాతవత్ నరేందర్ (40), భార్య సోని ఘట్‌కేసర్(M) అనోజిగూడలో నివాసం ఉంటున్నారు. అయితే బుధవారం ఉదయం నరేందర్ మరణించాడని అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారని మృతుడి తల్లి కామ్లికి పోలీసులు సమాచారం అందించారు. తన కుమారుడిని కోడలు సోని పథకం ప్రకారం తన సోదరులతో కలిసి హత్య చేసిందని ఆరోపిస్తూ కామ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్