భార్య హత్య కేసు.. నాలుగేళ్లుగా తప్పించుకున్న ఆర్మీ మాజీ కెప్టెన్ అరెస్ట్

7406చూసినవారు
భార్య హత్య కేసు.. నాలుగేళ్లుగా తప్పించుకున్న ఆర్మీ మాజీ కెప్టెన్ అరెస్ట్
భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఆర్మీ మాజీ కెప్టెన్ సందీప్ తోమర్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2013లో భార్యను హత్య చేసిన తోమర్‌కు 2014లో జీవిత ఖైదు పడింది. 2019లో బెయిల్​పై బయటకు వచ్చి, హైకోర్టు అప్పీల్​ను కొట్టివేసినా లొంగిపోలేదు. గుర్తింపు, నివాస ప్రాంతాలు మార్చుతూ తప్పించుకుంటున్న అతడిని, పాన్​కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా ద్వారా మధ్యప్రదేశ్​లోని పాంఢుర్నాలో ఎల్పీజీ సిలిండర్​ బుక్​ చేసిన సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్