తమిళనాడులోని తంజావూరు జిల్లాలో అప్పుల బాధతో భర్తను చంపేందుకు భార్య, ఆమె తమ్ముడు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షలు అప్పు చేసిన కూలీ రవిచంద్రన్ (54) అప్పు తీర్చలేక భార్య ఉమారాణి (48)తో తరచూ గొడవలు పడేవాడు. భర్త చనిపోతే అప్పుల బాధ ఉండదని భావించిన ఉమారాణి, తన తమ్ముడు జ్ఞానశేఖరన్ (35)తో కలిసి మంగళవారం రాత్రి రవిచంద్రన్ నిద్రిస్తున్న సమయంలో అతని చెవిలో విషం పోసింది. తప్పించుకున్న రవిచంద్రన్ ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.