త్వరలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్?

117చూసినవారు
త్వరలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్?
AP: మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ వార్తలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల అంబటి రాంబాబును పరామర్శించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సుమారు రెండేళ్ల విరామం తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన, జగన్‌ను మళ్లీ సీఎం చేసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని, వంద రోజుల జైలు జీవితానికి తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :