ఏ క్షణమైనా వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్?

31చూసినవారు
ఏ క్షణమైనా వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్?
AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగలనుంది. ఆర్‌పేట సీఐపై ఆయన వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో ఉన్న వ్యక్తిని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, సీఐను బెదిరించేలా దురుసుగా మాట్లాడటంపై ఎస్పీ అభ్యంతరం తెలిపారు. సీఐ విధులకు ఆటంకం కలిగించినందుకు గాను చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నానిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్