AP:
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి,
ఇండియా కూటమిలో ఉన్న సీపీఐతో కలసి ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయాలని ఒప్పందం చేసుకోవడంపై రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ,
జగన్ సొంత పత్రికలో వచ్చిన వార్తను ప్రస్తావించారు. కూటమితో పొత్తు ఉన్న సీపీఐతో కలసి
జగన్ ప్రజా సమస్యలపై ఎలా పోరాటం చేస్తారో
వైసీపీ శ్రేణులు ఆలోచించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.