AP: కడప జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు వైసీపీలో వ్యతిరేకత ఎదురవుతోందని ప్రచారం జరుగుతోంది. ఆయన కుటుంబ సభ్యుల తీరు పార్టీకి నష్టం చేకూర్చిందని అంచనా. దీంతో, ఆయనకు బదులుగా యువ డాక్టర్ సోహైల్ అహ్మద్‌కు టికెట్ ఇవ్వాలని కొందరు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఖలీల్ బాషా కుమారుడైన సోహైల్ అహ్మద్‌కు టికెట్ ఇస్తే విజయం సులభతరం అవుతుందని జగన్మోహన్ రెడ్డికి సర్వే నివేదికలు అందాయని సమాచారం.