AP: ప్రజలు ఎన్నో ఆశలతో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. శాసనసభలో తమ తరపున గళం వినిపిస్తారని ఆశలు పెట్టుకుంటారు. కానీ మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో యూరియా సమస్య ఉంది. ఉల్లి, టమాటా ధరలు పడిపోవడం సహా ఎన్నో సమస్యలున్నాయి. వీటిపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటున్నారు. అసెంబ్లీలో మైక్ కట్ చేసినా, అవమానాలు, విమర్శలు ఎదురైనా ప్రజా గళం వినిపిస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీకి బలం ఉంటుందంటున్నారు.