AP:
వైసీపీ అధినేత వైఎస్
జగన్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటు బ్యాంకును విస్తరించే వ్యూహంపై దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. యువత, నిరుద్యోగులు, మధ్యతరగతి, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బందిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, మెగా డీఎస్సీ, పెట్రోల్-డీజిల్ ధరల పెరుగుదల, ఉద్యోగుల సమస్యలపై
జగన్ పదేపదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉద్యోగుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో మాత్రం రానున్న ఎన్నికలే తేల్చనున్నాయి.