జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పై మరోసారి చర్చ మొదలైంది. టీడీపీతో పొత్తు కొనసాగించడం కంటే, ఒంటరిగా పోటీ చేసి పార్టీని బలోపేతం చేస్తేనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పెరుగుతాయని కొందరు రాజకీయ విశ్లేషకులు,
జనసేన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఫలితాలను మరిచి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని సూచిస్తున్నారు. జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా కాకుండా, స్వతంత్ర రాజకీయ బలం పెంచుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తారో చూడాలి.