అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ హెచ్చరికలతో బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్లు దాటగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) కూడా గణనీయంగా పెరిగింది. పరిస్థితి మరింత తీవ్రతరమైతే ఇరాన్ చమురు ఉత్పత్తి, హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరాకు అంతరాయం కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒత్తిడి పెరిగి, రానున్న రోజుల్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.