AP: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా పుంగనూరుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
వైసీపీ కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో గత స్థానిక ఎన్నికల్లో
వైసీపీ ఏకపక్షంగా గెలిచింది. అయితే, ఈసారి పుంగనూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుని పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని
టీడీపీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి మెజారిటీ తగ్గడంతో, ఈ స్థానిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు
టీడీపీ నాయకులు ప్రతి వార్డునూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్థానిక నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.