ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్‌లో నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనుండగా, ఆ నాలుగు పదవులు కూటమి ఖాతాలో పడనున్నాయి. అయితే, అనూహ్యంగా ఏపీకి చెందిన కాంగ్రెస్ నేత నీలకంఠాపురం రఘువీరారెడ్డికి రాజ్యసభ పదవి దక్కనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు ఏపీ నుంచి కాకుండా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.