AP: మాజీ మంత్రి రోజా ప్రస్తుతం బుల్లితెర, సినిమా రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తమిళంలో ఆమె నటించిన తల్లి పాత్ర చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమె మరిన్ని చిత్రాలకు ఒప్పందాలు చేసుకున్నారు. గతంలో రాజకీయాల కోసం నటనను పక్కన పెట్టిన రోజా, ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారించారు. గ్లామర్ రంగంలో బిజీ అయితే వైసీపీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం నేపథ్యంలో, ఆమె నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.