టీడీపీలోకి తమ్మినేని సీతారాం?

8చూసినవారు
టీడీపీలోకి  తమ్మినేని సీతారాం?
AP: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇటీవల తమ్మినేని కుటుంబం ఆస్తి వివాదంలో చిక్కుకుంది, దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడి కేసులో అధినేత జగన్మోహన్ రెడ్డి అప్పలరాజును పరామర్శించినా, తమ్మినేనిని కలవకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ శ్రేణులను హెచ్చరిస్తూ, ఇలాగే వ్యవహరిస్తే టీడీపీలో చేరుతానని ఆయన చెప్పినట్లు చర్చ నడుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్