కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే ఊహాగానాలకు ఎంపీ శశిథరూర్ తెరదించారు. తాను ఏ పార్టీలోకి మారడం లేదని, పార్టీ సిద్ధాంతాలపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తానని, యూడిఎప్ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వ తీరును, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని, భారత్ జోడో న్యాయ్ యాత్ర వంటి కార్యక్రమాలను ప్రశంసించారు. రాహుల్ మతతత్వాన్ని వ్యతిరేకించే నాయకుడని కొనియాడారు. గతంలో పార్టీ వైఖరికి తొలి ప్రాధాన్యతనిస్తూనే వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించానని అన్నారు.