AP: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధిపత్యం కొనసాగుతోంది.
జనసేన పార్టీ నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందిన ఆయన, ప్రభుత్వ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పట్టు సాధించగా, ప్రతిపక్ష వైసీపీలో అంతర్గత విభేదాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను సంప్రదించకుండా కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇది బొలిశెట్టికి మరింత కలిసివచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.