AP: చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంపై
టీడీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గ బాధ్యతల నుంచి చల్లా బాబును తప్పించి, మధుసూదన్ నాయుడుకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి పోటీ ఇచ్చేందుకు చంద్రబాబు ఈ కీలక మార్పులు చేసి, పుంగనూరులో
టీడీపీ విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.