AP: 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ఆశపడ్డ పార్టీలకు, రాజకీయ నేతలకు నిరాశే మిగిలేలా ఉంది. 2024లో కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ తమ నేతలకు సీట్లు సర్దుబాటు చేసేందుకు నానా అవస్థలు పడింది. కానీ 2026 ఎన్నికల్లో టీడీపీకి సీట్లు కేటాయింపు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. పదవుల కోసం వేచి ఉంటున్న నేతలకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఏం చేయాలని ఇప్పటినుంచే టీడీపీ ఆలోచనలో పడినట్లు సమాచారం.