రేపు మన్యం బంద్‌?

20066చూసినవారు
రేపు మన్యం బంద్‌?
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం (రేపు) జరగనున్న మన్యం బంద్‌పై ఉత్కంఠ నెలకొంది. ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు బంద్‌కు పిలుపునివ్వగా, దీనికి ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, బంద్‌ను పూర్తిగా శాంతియుతంగా నిర్వహిస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రకటించారు. దీంతో మన్యం ప్రాంతంలో బంద్ జరుగుతుందా? పోలీసుల చర్యలు ఎలా ఉంటాయన్న అంశాలపై ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్