విశాఖ పర్యటనలో సైకిల్‌పై ప్రయాణిస్తా: సీఎం చంద్రబాబు

52చూసినవారు
విశాఖ పర్యటనలో సైకిల్‌పై ప్రయాణిస్తా: సీఎం చంద్రబాబు
AP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు CM చంద్రబాబు సైకిల్‌పై ప్రయాణించనున్నట్లు తెలిపారు. జూన్ 5న సైకిళ్లు, ఈ-సైకిళ్లపై ప్రయాణించాలని, ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలని ఆయన పిలుపునిచ్చారు. భూమి, ప్రకృతి మన జీవనాధారమని, సహజ వనరులను కాపాడుకుంటూ గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా కృషి చేయాలని అన్నారు. పచ్చదనం పెంపు, ఇంధన వనరుల పొదుపు వినియోగం అవసరమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :