AP: ఈ నెల 21న శాప్ ఆఫీస్ వద్ద జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘యువగళం పేరుతో వచ్చి బెదిరిస్తారా?శాప్ ఆఫీస్ వద్ద ధర్నాకు వారికి అనుమతి ఎలా ఇచ్చారు? రాజశేఖర్ బాబు ఇది మీ పోలీసింగ్..? సీపీ మీ పోలీసింగ్ ఇది?మా లోకేష్ బాబుని అంటే ఊరుకోం, కొడతాం.. అని బహిరంగంగా మాట్లాడితే కేసులు ఉండవా? గేటు బయట కూర్చోవడానికి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు పర్మిషన్ ఉండదా?’ అని ప్రశ్నించారు.