వైఎస్సార్ చివరి కోరిక.. జగన్ తీర్చేనా?

136చూసినవారు
వైఎస్సార్ చివరి కోరిక.. జగన్ తీర్చేనా?
AP: దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీతోనే కొనసాగారు. 2009లో రెండోసారి సీఎం అయిన తర్వాత రాహుల్ గాంధీని 2014లో ప్రధాని చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తూ, వైఎస్సార్‌కు నిజమైన నివాళి రాహుల్‌ను ప్రధాని చేయడమేనన్నారు. అయితే వైఎస్సార్ కుమారుడు, వైసీపీ అధినేత జగన్ మాత్రం కాంగ్రెస్‌కు దూరంగా వైసీపీతో ఏపీ రాజకీయాల్లో ఉన్నారు. 2029లో ఎన్డీయేకు ఎదురుగా వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక ఇండియా కూటమితో జతకడుతుందా? అలా జరిగితే తండ్రి చివరి కోరిక నెరవేర్చే దిశగా జగన్ అడుగు వేసినట్టేనా? అని రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్