స్పెయిన్‌లో వైన్ తయారీదారులు బాటిళ్లను సముద్ర గర్భంలో నిల్వ ఉంచుతున్నారు. సుమారు 20-40 మీటర్ల లోతులో ప్రత్యేక పంజరాలలో ఉంచే ఈ అండర్‌వాటర్ వైన్ ఏజింగ్ ప్రక్రియలో, సముద్రపు అలల కదలిక, స్థిరమైన ఉష్ణోగ్రత, నీటి ఒత్తిడి వైన్‌ను త్వరగా పరిపక్వం చెంది, అద్భుతమైన రుచిని అందిస్తాయి. భూమిపై 3-4 ఏళ్లు పట్టే ప్రక్రియ సముద్రంలో ఒకటి, రెండు ఏళ్లలోనే పూర్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైన్ బాటిళ్లు ప్రకృతి సిద్ధమైన యాంటిక్ లుక్‌తో అంతర్జాతీయ మార్కెట్‌లో లక్షల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. ఈ వినూత్న ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.