పొలంలో మంటలు అంటుకుని మహిళ సజీవదహనం

9చూసినవారు
పొలంలో మంటలు అంటుకుని మహిళ సజీవదహనం
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో వ్యర్థాలను తగలబెట్టే సమయంలో అనుకోకుండా మంటలు అంటుకోవడంతో వృద్ధురాలు పావులూరి పిచ్చమ్మ (70) సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్