TG: పని చేస్తున్న కంపెనీ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్తూరు మద్దినాయినిపల్లి కూనపల్లికి చెందిన పున్నగు రాధ కూతురు అనిత(23)కు దారా శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఓ పాప ఉంది. అనిత KPHBలోని ఓ కంపెనీలో పని చేస్తున్న అనిత.. గురువారం డ్యూటికి వెళ్లి పని చేసే కంపెనీ భవనం పైనుంచి దూకింది. స్థానికులు అనితను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు.