AP: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుని వైపు వెళ్తున్న స్కూటీని వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టి ట్రాలీపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన గాయత్రిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.