AP: కోనసీమ జిల్లాకు చెందిన ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ చీరకు నిప్పు అంటుకుని పేపకాయల చిట్టితల్లి (54) అనే మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాలు.. సోమవారం ఉదయం ఆమె పొయ్యి వెలిగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.