యూట్యూబ్‌ చూసి ఇంట్లో సహజ ప్రసవం కోసం ప్రయత్నం.. మహిళ మృతి

20555చూసినవారు
యూట్యూబ్‌ చూసి ఇంట్లో సహజ ప్రసవం కోసం ప్రయత్నం.. మహిళ మృతి
తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలో ఇంట్లో సహజ ప్రసవం కోసం చేసిన ప్రయత్నం విషాదంగా మారింది. 32 ఏళ్ల శశికళకు తొలి ప్రసవం సిజేరియన్ కావడంతో మరోసారి శస్త్రచికిత్సకు ఆమె కుటుంబం ఇష్టపడలేదు. దీంతో యూట్యూబ్‌లోని సమాచారాన్ని నమ్మి ఇంట్లోనే సహజ ప్రసవానికి ప్రయత్నించింది. అయితే ఇంట్లోనే ప్రసవించి ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. కానీ, మావి సంబంధిత సమస్యలు, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు భర్తపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్