TG: ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని రాళ్లగూడ గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతురాలి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.