ఆసుపత్రి గేట్ ముందరే ప్రసవించిన మహిళ

13670చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి గేటు ముందే ఓ మహిళ నెలలు నిండకుండానే ప్రసవించింది. సకాలంలో వైద్య సంరక్షణ అందలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రసవం తర్వాత ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నేలపై ఉన్న రక్తాన్ని సిబ్బంది శుభ్రం చేస్తున్న వీడియో వైరల్ అయింది. నవజాత శిశువు పరిస్థితి విషమంగా ఉందని, NICUలో చికిత్స అందిస్తున్నారని తెలిసింది. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం విచారణకు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్