ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం జిల్లా జడ్జి సెలవులో ఉండటంతో ఉదయాన్నే కోర్టు హాలులోకి వచ్చిన వందనా గుప్తా (50) అనే మహిళ నేరుగా వెళ్లి జడ్జి కుర్చీలో కూర్చున్నారు. అక్కడ ఉన్న గావెల్‌ను(చెక్క సుత్తి) కొడుతూ ‘ఆర్డర్ ఆర్డర్.. విచారణలు ప్రారంభించండి’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని తేలడంతో పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు.