భర్త ఇంటి ముందు మహిళ నిరాహార దీక్ష: న్యాయం చేయాలని వేడుకోలు

6795చూసినవారు
భర్త ఇంటి ముందు మహిళ నిరాహార దీక్ష: న్యాయం చేయాలని వేడుకోలు
TG: హనుమకొండ(D) కమలాపూర్ (M) గుండేడులో శ్రీజ అనే మహిళ తన భర్త డెంగు రాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం కోసం తనని వేధిస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగింది. వివాహ సమయంలో రూ.12 లక్షల నగదు, 16 తులాల బంగారం ఇచ్చినా, పెళ్లైన మూడు నెలల నుంచే భర్త, అత్త వేధింపులకు గురి చేశారని వాపోయింది. ఆన్‌లైన్‌ పేకాటలో డబ్బులు పోగొట్టుకుని అదనపు కట్నం కోసం వేదిస్తూ పుస్తెల తాడుతో ఉరి బిగించేవాడని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్