రైలు జనరల్ బోగీలో ఒక మహిళ చేసిన పనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. పల్లీలు తిని, ఆ పొట్టును సీటు కిందే పడేసి, అక్కడే నీళ్లతో చేతులు కడుక్కున్న ఆమె తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లడానికి కూడా బద్ధకించి, తన చుట్టూ అపరిశుభ్రతను సృష్టించిన ఆమె చర్య దేశం పరిశుభ్రతకు పెద్ద సవాల్ అని విమర్శించారు. స్వచ్ఛ
భారత్ ప్రచారాలు జరుగుతున్నా ఇలాంటి ప్రవర్తన దేశానికి అపఖ్యాతి తెస్తుందని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ ఘటనను ఆమె ఎదురుగా కూర్చున్న ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.