బీహార్‌లోని పహార్ పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఘోరం జరిగింది. రైల్వే ట్రాక్‌ల మధ్య డంప్ చేసిన కలప దుంగలు తీస్తున్న మహిళను అటువైపు నుంచి వస్తున్న ట్రైన్ ఢీకొట్టింది. ప్లాట్‌ఫాం వైపు వెళ్లిన ఆమెను ట్రైన్ ఢీకొనడంతో, ఎగిరిన దుంగ ఆమె తలకు బలంగా తగిలింది. దీంతో మహిళ గోడకు తగిలి కింద పడి తీవ్ర గాయాలపాలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.