బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు

8873చూసినవారు
బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు రాగా, డ్రైవర్ సమయస్ఫూర్తితో ఆమె ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. తుమకూరు నుంచి మధుగిరికి వెళ్తున్న బస్సులో ఓ మహిళకు గుండెపోటు వచ్చింది. దీంతో బస్సులోని తోటి ప్రయాణికులత డ్రైవర్ మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. డ్రైవర్ సమయస్ఫూర్తి, ప్రయాణికుల సపోర్ట్‌పై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.

సంబంధిత పోస్ట్