ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లి(30) తన మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని, అతనితో కలిసి పారిపోయింది. వీరిద్దరి మధ్య గత నాలుగు నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. వెళ్లేముందు రాసిన లేఖలో, తన మేనల్లుడిని ప్రేమిస్తున్నానని, అతనితోనే భార్యగా జీవించాలనుకుంటున్నానని ఆమె పేర్కొంది. ఈ సంఘటన ఇరు కుటుంబాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.