ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు

14131చూసినవారు
ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు
AP: విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులో సీటు వివాదం ఘర్షణకు దారితీసింది. విశాఖపట్నంకు చెందిన 14 ఏళ్ల బాలిక భార్గవి, కుటుంబంతో కలిసి అమ్మవారి పండుగకు వెళ్లి తిరిగి వస్తుండగా, కిక్కిరిసిన బస్సులో సీటులో కూర్చున్న మహిళకు ఆమె బ్యాగ్ తగలడంతో వివాదం మొదలైంది. మాటల యుద్ధం కాస్తా ఘర్షణగా మారి, మహిళలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. గాయపడిన బాలికకు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్