AP: మాచర్ల ఏఎస్ఐ వ్యవహార శైలిని మహిళా కమిషన్ ఖండించింది. మాచర్ల ఏఎస్ఐపై సమగ్ర విచారణ చేయాలని ఎస్పీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ అన్నారు. మహిళలను ఇబ్బంది పెట్టిన వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.