మహిళల ఆత్మవిశ్వాసం.. ‘ఆర్ బీ ఫర్ ఉమెన్’

12141చూసినవారు
మహిళల ఆత్మవిశ్వాసం.. ‘ఆర్ బీ ఫర్ ఉమెన్’
బైక్ స్టార్ట్ అవ్వగానే భయం కాదు, స్వేచ్ఛ, సాధికారిత మొదలవ్వాలనే ఆత్మవిశ్వాసాన్ని మహిళల్లో నింపేందుకు మొదలు పెట్టిందే ‘ఆర్ బీ ఫర్ ఉమెన్’. ఇప్పటికి దేశవ్యాప్తంగా 570 మందికి పైగా మహిళలకు రైడింగ్‌లో శిక్షణ ఇచ్చింది. గృహిణుల నుంచి ప్రొఫెషనల్స్ వరకు, విద్యార్థుల నుంచి ఉద్యోగస్తుల వరకు ఈ శిక్షణలో పాల్గొనడం విశేషం. ప్రతి ఒక్కరికీ భయం లేకుండా వాహనాలు నడపడం నేర్పించడమే దీని ప్రత్యేకత. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఈ కార్యక్రమం మహిళల భవిష్యత్తుకు శుభారంభం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్