మహిళల
క్రికెట్ చరిత్రలో
ఐసీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఉమెన్స్
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ప్రైజ్ మనీని భారీగా పెంచుతూ అధికారిక ప్రకటన చేసింది. ఈసారి మొత్తం ప్రైజ్ పూల్ కింద 8,764,615 అమెరికన్ డాలర్లను (దాదాపు రూ.82.88 కోట్లు) కేటాయించింది. విజేత జట్టుకు 2,340,000 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.22.13 కోట్లు), రన్నరప్‌కు 1,170,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.11.07 కోట్లు) లభించనున్నాయి. సెమీఫైనలిస్టులకు ఒక్కొక్కరికి 675,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.6.38 కోట్లు) దక్కనున్నాయి.