ఢిల్లీలో వర్క్ ఫ్రం హోమ్ రద్దు: సీఎం రేఖా గుప్తా

13902చూసినవారు
ఢిల్లీలో వర్క్ ఫ్రం హోమ్ రద్దు: సీఎం రేఖా గుప్తా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరా మందగించడంతో, మే నెలలో ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు బుధ, శనివారాల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో.. సీఎం రేఖా గుప్తా ఆదేశాల మేరకు ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. ఆఫీసు వేళలను ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు మార్చారు. గతంలో 10.30 నుంచి 7 గంటల వరకు ఉండేది. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్