ప్రపంచ ఛాంపియన్లు వైజాగ్ వస్తున్నారు: నారా లోకేష్

404చూసినవారు
ప్రపంచ ఛాంపియన్లు వైజాగ్ వస్తున్నారు: నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. "వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు, ఈ నెలలోనే" అని ఆయన పేర్కొన్నారు. వారు ఎవరో ఊహించగలరా అని నెటిజన్లకు సవాల్ విసిరారు. ఈ ట్వీట్ విశాఖ ప్రజలలో ఆసక్తిని రేకెత్తించింది. క్రీడా రంగంలోనే కాకుండా ఐటీ వంటి ఇతర రంగాలలోనూ ఛాంపియన్లు ఉంటారని, ఈ ఛాంపియన్లు ఏ రంగానికి చెందినవారో, ఎవరో అనే దానిపై చర్చ జరుగుతోంది.