రెండు సంవత్సరాల 11 నెలల వయసులోనే అత్యంత పిన్న వయస్కుడిగా చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించి కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ చరిత్ర సృష్టించాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 15 నిమిషాల 52 సెకండ్లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడం, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చడం వంటి రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) లో స్థానం సంపాదించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.